ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amrit scheme: వారంలో ‘అమృత్‌’ టెండర్లు రద్దుచేయాలి..

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:49 AM

అమృత్‌ పథకం పనులకు సంబంధించి పిలిచిన టెండర్లను వారం రోజుల్లో రద్దు చేసి, గ్లోబల్‌ టెండర్లను పిలవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

  • రేవంత్‌ సోదరుడు, బావమరిదికి కాంట్రాక్టులు

  • రద్దు చేయకపోతే ఉద్యమం: బీజేఎల్పీ నేత ఏలేటి

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): అమృత్‌ పథకం పనులకు సంబంధించి పిలిచిన టెండర్లను వారం రోజుల్లో రద్దు చేసి, గ్లోబల్‌ టెండర్లను పిలవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కేటాయింపులో అవినీతి జరిగిందని, మూడు కంపెనీలకు 40శాతం అధిక రేటుతో పనులు కట్టబెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ బావమరిది సృజన్‌ కంపెనీ శోధకి రూ. 1,110కోట్లు, రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి కంపెనీ కేఎల్‌ఆర్‌కు రూ.1,135కోట్లు, మరో ప్రముఖ కంపెనీకి రూ.1,200కోట్ల అంచనాతో అమృత్‌ స్కీం పనులను ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు.


గ్లోబల్‌ టెండర్లు పిలిస్తే కనీసం 30శాతం తక్కువకు పనులు చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ చేశారు. వారం రోజుల్లో టెండర్లు రద్దు చేయకపోతే బీజేపీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. రేవంత్‌ బావమరిది సృజన్‌ అటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో కలిసి వ్యాపారం చేస్తారని.. ఇక్కడ ఆయనకు కాంగ్రెస్‌ కాంట్రాక్టులు ఇస్తుందని అన్నారు. రేవంత్‌ బాబా-11 దొంగలు మాదిరి ఎవరికి తోచినంత వారు బీ ట్యాక్స్‌, యూ ట్యాక్స్‌, డబుల్‌ ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నారన్నారు..

Updated Date - Jul 14 , 2024 | 03:49 AM

Advertising
Advertising
<