ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka : ప్రపంచంతో పోటీపడేలా ప్రజాపాలన

ABN, Publish Date - Sep 18 , 2024 | 04:32 AM

ప్రపంచంతోనే పోటీపడేలా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

  • భూమిలేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు: భట్టి విక్రమార్క

  • రేవంత్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి: తుమ్మల

  • త్యాగాల ఫలితమే తెలంగాణ కు విముక్తి: స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

ఖమ్మం/చింతకాని/కొత్తగూడెం/వికారాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతిప్రతినిధి): ప్రపంచంతోనే పోటీపడేలా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి, సాగునీరు, పారిశ్రామిక రంగాల అభివృద్దితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రాష్ట్ర ప్రభత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం పోలీసు పరేడ్‌ మైదానంలో భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17కు ఒక విశిష్టత ఉందన్నారు. 76 ఏళ్ల క్రితం ఇదేరోజున హైదరాబాదు సంస్థానం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో అంతర్భాగమైందని చెప్పారు.

విముక్తి పోరాటంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా, ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో మంగళవారం రెండో విడత దళితబంధు పథకంలో భాగంగా 847మంది లబ్ధిదారులకు సుమారు 15కోట్ల మంజూరు పత్రాలను భట్టివిక్రమార్క పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని, ప్రతి ఏడాది ఈ డబ్బులను అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ నేడు దేశంలోనే అభివృద్ధి పథంలో ముందజలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు తెలిపారు.

కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌ దార్శనిక పాలనలో తెలంగాణలో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో ప్రభుత్వం రైతు రుణభారాన్ని మాఫీ చేయడంతో పాటు వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు అందిస్తుంటంతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు.

సెప్టెంబరు 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని, ఎంతో మంది అసమాన త్యాగాల ఫలితంగానే తెలంగాణకు విముక్తి కలిగిందని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందున్నదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 04:32 AM

Advertising
Advertising