Keesara: శివయ్యా...పాహిమాం!
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:13 AM
హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభంకావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు. కార్తీక రెండో సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకొని పూజలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రం... కీసర గుట్టలో శ్రీరామలింగేశ్వర స్వామికి ఘనంగా రుద్రాభిషేకం జరిగింది. ఆలయం వెలుపల ఉన్న శివలింగాలకు భక్తులు అభిషేకాలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఈ క్రమంలో ఓ వానరం గుట్టపై ఉన్న ఓ శివలింగాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో మొక్కింది. పక్కనే కొబ్బరి చిప్పలున్నా ‘కోతి’ చేష్టాలు చేయకుండా దండంపెడుతున్న ఈ ఆసక్తికర దృశ్యాన్ని ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్ మనిపించింది. - కీసర, ఆంధ్రజ్యోతి
Updated Date - Nov 12 , 2024 | 04:13 AM