ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరి అరెస్టు

ABN, Publish Date - Sep 02 , 2024 | 05:12 AM

నల్గొండ జిల్లాలో నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ జితేందర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

  • 2 ఆస్పత్రుల పేరుతో 19 నకిలీ బిల్లుల

  • నల్గొండ ప్రాంతంలో మెసాలు : డీజీపీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లాలో నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు కుంభకోణంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీజీపీ జితేందర్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆస్పత్రులు సమర్పించిన సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) దరఖాస్తుల్లో వ్యత్యాసాలున్నాయన్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం ఆరు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నల్గొండ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడైందని, వారు నకిలీ బిల్లులు సృష్టించి.. ప్రభుత్వాన్ని మోసగించారని తెలిపారు. నల్గొండకు చెందిన అమ్మ హాస్పిటల్‌, మిర్యాలగూడకు చెందిన నవీనా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ పేర్లతో వారు 19 నకిలీ దరఖాస్తులు సమర్పించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో గొట్టి గిరి(46), లేకిరెడ్డి సైదిరెడ్డి(40)లను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోసం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినట్లు డీజీపీ పేర్కొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 05:12 AM

Advertising
Advertising