Share News

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా

ABN , Publish Date - May 11 , 2024 | 06:58 PM

పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా
DGP Ravi Gupta

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో భద్రత విధుల నిమిత్తం 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రత విధుల్లో ఉంటారని వెల్లడించారు.


మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీమ్‍లను ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖీల్లో రూ. 184 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా 34,526 మందిని బైండోవర్ చేశామని అన్నారు. పొలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూముకు చేరేంతవరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు.

Loksabha Polls: సాయంత్రం 6 నుంచి 144 సెక్షన్ అమలు: వికాస్ రాజ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 11 , 2024 | 07:16 PM