ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేయను

ABN, Publish Date - Jun 06 , 2024 | 05:05 AM

కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్‌ చేయనని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.

  • పార్టీ ఏ పదవి అప్పగించినా పనిచేస్తా: డీకే అరుణ

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్‌ చేయనని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని బీజేపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాయని, రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటికీ బీజేపీ చేరిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రాజీనామా చేయాలని కోరడం లేదన్నారు. హద్దులు దాటి సీఎం రేవంత్‌ రిజర్వేషన్లపై అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఈ నెల 8వ తేదీన పార్లమెంట్‌ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆమె తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 05:05 AM

Advertising
Advertising