ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: కేంద్ర జలవనరుల శాఖ అలా చెప్పడం బాధాకరం: డీకే సరమసింహారెడ్డి

ABN, Publish Date - Mar 18 , 2024 | 04:36 PM

పెండింగ్‌లో ఉన్నా కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి డీకే సరమసింహారెడ్డి (Samarasimha REDDY) కోరారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణనది నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాట దక్కడం లేదని చెప్పారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాట రావాల్సి ఉందన్నారు.

హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్నా కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి డీకే సరమసింహారెడ్డి (Samarasimha REDDY) కోరారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణనది నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాట దక్కడం లేదని చెప్పారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాట రావాల్సి ఉందన్నారు. ఎక్కువనీళ్లు తెలంగాణ వాడుకుంటుందని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి తమ జిల్లావారేనని సీఎం, పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యాతాయుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోనే చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ పనులనే చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కృష్ణావాటర్ సమస్యను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు.1990లో తాను రెవెన్యూ మినిస్టర్‌గా 29 మందిని ఓ విషయంలో సస్పెండ్ చెయ్యాల్సి వచ్చిందని డీకే సరమసింహారెడ్డి గుర్తు చేశారు.

Rammohan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు

Vinod Kumar: దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌తో తెలంగాణకు సమస్యలు: కోదండరెడ్డి

మొట్టమొదటి బచావత్ ట్రిబ్యునల్ న్యాయంగా తెలంగాణకు నీళ్లను పంపకం చేసిందని.. కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌తో రాష్ట్రానికి అన్ని ఇబ్బందులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి (Kodanda Reddy) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణకు అన్యాయం చేస్తూ పక్కరాష్ట్రాలకు ఎక్కువగా కేటాయింపులు జరిగాయని చెప్పారు. కిరణ్ కుమార్‌రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు తామంతా నీటి కోసం పోరాటం చేశామని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సరిచేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అయితే 2014 నుంచి నీటికేటాయింపులు మరింత దారుణంగా మారాయని చెప్పుకొచ్చారు. కృష్ణ రివర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా ప్రవహిస్తున్నా నీటి కష్టాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవరించాలని కోరారు. కృష్ణ రివర్ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. కృష్ణా రివర్ బోర్డు తెలంగాణకు కావాల్సినదానికంటే ఎక్కువగా నీటిని వాడుకుంటుందని చెప్పడం దారుణమని కోదండరెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి

PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!

Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?

Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 04:37 PM

Advertising
Advertising