Blackbuck Award: డాక్టర్ లోకేశ్వరరావు సజ్జాకు బ్లాక్‌బక్ అవార్డు..
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:26 AM
స్టార్ ఆస్పత్రికి చెందిన డా.లోకేశ్వరరావు సజ్జాకు వైద్య పరిశోధనలో చేసిన కృషికి 2024 సంవత్సరానికి బ్లాక్‌బక్ అవార్డు(బ్లాక్‌బక్ పయనీర్ రీసెర్చర్ అవార్డు) దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : స్టార్ ఆస్పత్రికి చెందిన డా.లోకేశ్వరరావు సజ్జాకు వైద్య పరిశోధనలో చేసిన కృషికి 2024 సంవత్సరానికి బ్లాక్‌బక్ అవార్డు(బ్లాక్‌బక్ పయనీర్ రీసెర్చర్ అవార్డు) దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ డా.లోకేశ్వరరావు సజ్జా వైద్య పరిశోధన రంగంలో చేసిన విలువైన కృషికి బ్లాక్‌బక్ రీసెర్చర్ పురస్కారం లభించిందన్నారు. దేశంలో కరొనరీ శస్త్రచికిత్సలను అభివృద్ధి చేయడానికి అంకితమైన ‘సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్’ను డా.సజ్జా స్థాపించినట్లు పేర్కొన్నారు.
ఆయన స్ఫూర్తి యాంత్రిక ‘ప్రొసైటిక్ ’ హృదయ నాళ కవాటాన్ని అభివృద్ధి చేయడానికి దారితీసిందన్నారు. అనేక అంతర్జాతీయ, జాతీయ సమావేశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించడంతో పాటు పేరొందిన జర్నల్స్‌లో 115 కంటే ఎక్కువ కథనాలు రచించారని తెలిపారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ - థొరాసిక్ సర్జన్స్(ఐఏసీటీఎ్‌స)2023-24 అధ్యక్షుడిగా ఎంతోమంది రోగులకు ప్రయోజనం చేకూర్చారని వైద్యులు తెలిపారు.
Updated Date - Jul 29 , 2024 | 03:26 AM