ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: ఖమ్మం జిల్లాలో డ్రోన్‌ పరీక్ష కేంద్రం..

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:17 AM

ఖమ్మం జిల్లాలో డ్రోన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో 53.18 ఎకరాల భూమిని ప్రతిపాదించారు.

  • రేమిడిచర్లలో స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఖమ్మం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో డ్రోన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో 53.18 ఎకరాల భూమిని ప్రతిపాదించారు. ఈ స్థలాన్ని శుక్రవారం ఏవియేషన్‌ అధికారులు పరిశీలించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతోపాటు నూతనంగా ఏర్పాటు కానున్న జాతీయ రహదారికి సమీపంలో ప్రతిపాదిత స్థలం ఉండటం, రైల్వేజోన్‌ కూడా దగ్గరలో ఉండటంతో ఏవియేషన్‌ అధికారులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.


అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన స్థలం సరిపోతుందో లేదోనన్న అంశంపై మాత్రం నివేదిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థలం విషయంపై సందిగ్ధం వీడితే ఖమ్మం జిల్లాలో డ్రోన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ జమలాపురంలోని వాసిరెడ్డి కల్యాణ మండపంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారముంటుందని, డ్రోన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలెక్టర్‌ కోరారు.

Updated Date - Jul 13 , 2024 | 04:17 AM

Advertising
Advertising
<