ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: ఆ భూములను వెనక్కి ఇచ్చేయండి..

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:23 AM

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్‌సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు.

  • పీఎ్‌సయూలకు గతంలో రాష్ట్రంలో ఇచ్చిన భూములపై

  • కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి దుద్దిళ్ల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (పీఎ్‌సయూ)లకు రాష్ట్రప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడెం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి కుమారస్వామిని కలిశారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద విక్రయించాలని నిర్ణయించినందున వాటి మిగులు భూములను తిరిగి రాష్ట్రానికి అప్పగించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 70 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేయగా వాటికి అప్పట్లో వేలాది ఎకరాల భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.


ఖాయిలా పడిన ఆదిలాబాద్‌ సీసీఐ సిమెంటు పరిశ్రమను పునరుద్ధరించి స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నందున కొత్తగా వచ్చే పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడి అభివృద్థి కార్యక్రమాలకు సహకరించాలన్న శ్రీధర్‌ బాబు అభ్యర్థనకు కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చి.. తన దృష్టికి తెచ్చిన అన్ని విషయాలపై అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 29 , 2024 | 03:23 AM

Advertising
Advertising