ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra: దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు..

ABN, Publish Date - Oct 08 , 2024 | 07:24 AM

సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్‌ ఆపరేషన్స్‌కు పోలీస్‌, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌(TGS RTC MD VC Sajjanar) కోరారు.

- సద్దుల బతుకమ్మ, దసరా ఆపరేషన్స్‌కు పోలీస్‌, రవాణాశాఖలు సహకరించాలి

- టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: సద్దుల బతుకమ్మ, దసరాకు 6,304 ప్రత్యేక బస్సులను జిల్లాలకు నడుపుతున్నామని, స్పెషల్‌ ఆపరేషన్స్‌కు పోలీస్‌, రవాణా శాఖల అధికారులు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌(TGS RTC MD VC Sajjanar) కోరారు. దసరా ఆపరేషన్స్‌పై ముషీరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అధ్యక్షతన పోలీస్‌, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దసరాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆర్టీసీ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR: రేవంత్‌ సృష్టించిన భయంతో ఆదాయం తగ్గింది


గతేడాది కంటే అదనంగా 600 స్పెషల్‌ సర్వీసులు

మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో గత ఏడాది కంటే అదనంగా 600 స్పెషల్‌ సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచుతుంది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బోయిన్‌పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్‌ సదన్‌, బోరబండ, శంషాబాద్‌లలో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తునట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను, ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించినట్లు తెలిపారు.


ఓఆర్‌ఆర్‌ మీదుగా..

ఐటీ కారిడార్‌ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌(Gachibowli ORR) మీదుగా విజయవాడ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు బస్సులను నడుపుతామన్నారు. జేబీఎన్‌ నుంచి 1602, ఎల్బీనగర్‌ నుంచి 1193, ఉప్పల్‌ నుంచి 585, ఆరాంఘర్‌ నుంచి 451 అదనపు బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే 13, 14 తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లకు సంస్థ వెబ్‌సైట్‌ tgsrtcbus.inలో చేసుకోవాలన్నారు. దసరా స్పెషల్‌ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎ్‌సఆర్టీసీ కాల్‌ సెంటర్ల నంబర్లు 040- 69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్‌ సిటీ అదనపు కమిషనర్‌ (ట్రాఫిక్‌) విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. పండగ సమయంలో ఆర్టీసీకి తమ సహకారం ఉంటుందన్నారు.


సమావేశంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌, హైదరాబాద్‌ డీసీపీలు రాహుల్‌ హెగ్డే, అశోక్‌కుమార్‌, రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీలు శ్రీనివాసులు, మనోహర్‌, ట్రాఫిక్‌ అదనపు డీసీపీలు వీరన్న, ఎండీ మాజిద్‌, రవాణా శాఖలకు చెందిన ఆర్టీఏలు వాణి, పురుషోత్తం రెడ్డి, సుభాస్‌ సి రెడ్డి, టీజీఎస్‌ ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) డా.వి.రవీందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, వినోద్‌కుమార్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు శ్రీలత, వరప్రసాద్‌, కేఎస్‌ ఖాన్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలో టీడీపీలోకి తీగల

ఇదికూడా చదవండి: Police Department: అవినీతి ఐపీఎస్‌లపై కొరడా!

ఇదికూడా చదవండి: Gold Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన పసిడి ధరలు..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 08 , 2024 | 07:33 AM