ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor: బ్రో.. బీరు తాగుతున్నావా.. ఇది చూడు ఓసారి..

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:59 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది బీరు తాగుతుంటారు. సంతోషమైనా.. బాధైనా.. వెంటనే వైన్ షాపులో తేలిపోతుంటారు. ముఖ్యంగా యువత.. నలుగురు స్నేహితులు కలిశారంటే చాలు.. ఇక బీర్ల జాతరే. చల్ల చల్లని బీర్లను కుమ్మేస్తుంటారు. మీరు కూడా బీర్లు తెగ తాగేస్తున్నారా? చల్లగా ఉందని..

ధారూరు, అక్టోబరు 25: ప్రస్తుత కాలంలో చాలా మంది బీరు తాగుతుంటారు. సంతోషమైనా.. బాధైనా.. వెంటనే వైన్ షాపులో తేలిపోతుంటారు. ముఖ్యంగా యువత.. నలుగురు స్నేహితులు కలిశారంటే చాలు.. ఇక బీర్ల జాతరే. చల్ల చల్లని బీర్లను కుమ్మేస్తుంటారు. మీరు కూడా బీర్లు తెగ తాగేస్తున్నారా? చల్లగా ఉందని ఏమీ చూసుకోకుండా గటగటా మింగేస్తున్నారా? ఆగండి.. ఒక నిమిషం చూడండి. అవును.. బీరు కొనుగోలు చేయడానికి ముందు.. ఆ బీర్ బాటిల్‌ను సరిగా చెక్ చేయండి. లేదంటే మీకు డబ్బులు లాస్.. చూడకుండా తాగేస్తే ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. మరి ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే ఈ కథనం చదివితే మీకే అర్థమవుతుంది.


తాగేందుకు కొన్న బీరు బాటిలో గుర్తుతెలియని అవశేషం కన్పించడంతో కొనుగోలుదారులు భయందోళనకు గురయ్యారు. ధారూరులోని ఓ వైన్ షాపులో కొన్న బీరు సీసాలో ఏదో అవశేషం ఉందని సదరు వ్యక్తులు గుర్తించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది. కేరెల్లికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య విందు కోసమని రూ. 4 వేల విలువైన వివిధ బ్రాండ్ మద్యాన్ని కొనుగోలు చేశారు. ఓ కంపెనీ స్ట్రాంగ్ బీరు సీసాలో గుర్తుతెలియని అవశేషం కన్పించడంతో అవాక్కయ్యారు. బీరు బాటిల్లో ఉన్నది బల్లి అవశేషం అనుకొని భయాందోళనకు గురయ్యారు. బాటిల్‌ను ఓపెన్ చెయ్యకుండా వైన్ షాప్‌కి వెళ్లి యజమానిని ప్రశ్నించారు. తనకు సంబంధం లేదని షాప్ ఓనర్ దబాయించాడు.


దీంతో లక్ష్మీకాంత్ రెడ్డి బీరు బాటిల్ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది వైరలైంది. ఇదిలా ఉంటే సదరు సైన్స్ అమ్మింది కంపెనీ బీరేనా! లేక టేబుల్ వేసి నకిలీ బీరేమైనా అమ్ముతున్నారా? అని మద్యం కొనుగోలుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, పొరపాట్లు చేసే తయారీదారులు, పంపిణీదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత

వార్నర్‌కు బిగ్ రిలీఫ్.

ఓ వైపు రంగులు వేస్తూనే.. దేశభక్తిని ఎలా చాటాడో చూడండి..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 05:52 PM