ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Eatala Rajender: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోం..

ABN, Publish Date - Aug 30 , 2024 | 03:48 AM

పేదల ఇళ్లను కూల్చి వేస్తే ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. గురువారం ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్‌లోని హస్మత్‌పేట బోయిన చెరువును ఆయన సందర్శించారు.

  • రాష్ట్రానికి తొలి సీఎంలా రేవంత్‌ పోజు: ఈటల

ఓల్డుబోయినపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్లను కూల్చి వేస్తే ఊరుకోబోమని ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. గురువారం ఓల్డ్‌ బోయినపల్లి డివిజన్‌లోని హస్మత్‌పేట బోయిన చెరువును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 70 ఏళ్లు దాటినా.. ఇవాళే రాష్ట్రం ఏర్పడినట్లుగా.. మొదటి సీఎం తానే అయినట్లుగా రేవంత్‌రెడ్డి పోజు కొడుతున్నాడని విమర్శించారు.


ఎన్‌ కన్వెన్షన్‌ను, ఒకటో రెండో పెద్దవాళ్ల నిర్మాణాలను కూల్చి.. వందలాది మంది పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. హస్మత్‌పేట్‌ చెరువు పక్కన ఇళ్లు కట్టుకున్న 125 మందికి, అల్వాల్‌ చెరువు సమీపంలో ఉన్న 120 మందికి నోటీసులు ఇవ్వడంతో వారంతా కన్నీరుమున్నీరవుతున్నారని చెప్పారు. వారంతా 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి గొప్ప ప్రగతి కామికుడని.. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలరని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ లాంటివారు పొగుడుతున్నారని.. వారికి చెరువు పక్కన ఉన్న పేదోళ్ల కన్నీళ్లు తెలుసా..? అని ఈటల ప్రశ్నించారు.

Updated Date - Aug 30 , 2024 | 03:48 AM

Advertising
Advertising