ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED raids: గొర్రెల కుంభకోణం.. వివరాల సేకరణకు ఈడీ తంటాలు!

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:40 AM

గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల గోల్‌మాల్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు వివరాల సేకరణకు తంటాలు పడుతున్నారు. కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

  • సమాచారం ఇవ్వని సహకార సంస్థ

  • కారణాలు, ఆలస్యంపై ఈడీ అధికారుల ఆరా

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల గోల్‌మాల్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు వివరాల సేకరణకు తంటాలు పడుతున్నారు. కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో కేసు విచారణకు అవసరమైన సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ(టీజీ ఎస్‌జీడీసీఎ్‌ఫఎల్‌) అధికారులకు లేఖ రాసి నెలరోజులు గడిచినా.. అడిగిన వివరాలు ఇప్పటి వరకు ఈడీ అధికారులకు అందలేదు. దీంతో సహకార సంస్థపై ఈడీ అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఫోన్‌ నంబర్లు, గొర్రెల యూనిట్లు ఎవరి నుంచి కొనుగోలు చేశారు? ఎంత చెల్లించారు?


పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌, సంస్థ ఏ ఖాతా నుంచి ఎంత మొత్తం బదిలీ చేసింది? గొర్రెలకు దాణా అమ్మిన వారెవరు? అనే వివరాలను ఈడీ అధికారులు కోరుతున్నారు. రూ.వందల కోట్ల అక్రమాల నేపథ్యంలో ప్రతి అంశానికి సంబంధించిన వివరాలు కావాలని ఈడీ డైరెక్టర్‌ అప్పట్లో స్పష్టం చేశారు. నెల దాటినా ఇంకా వివరాలు అందకపోవడంతో.. ఇటీవల ఈడీ అధికారులు ‘‘ఇంకెంత సమయం పడుతుంది?’’ అంటూ కారణాలు, ఆలస్యంపై విచారించినట్లు తెలిసింది. దానికి సహకార సంస్థ అధికారులు.. జిల్లాల వారీగా వివరాల సేకరణకు సమయం పడుతుందని చెప్పినట్లు సమాచారం. కాగా.. ఈ కేసులో కీలక నిందితుడు మొహియుద్దీన్‌, అతని కుమారుడు విదేశాల్లో ఉండగా.. ఏపీకి చెందిన దళారికి నోటీసులు జారీ చేసి, విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.

Updated Date - Jul 25 , 2024 | 04:40 AM

Advertising
Advertising
<