ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: కొణిజర్ల కేజీబీవీ గోడల నుంచి విద్యుత్‌ షాక్‌

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:30 AM

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని బస్వాపురంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) గోడలకు విద్యుత్‌ ప్రసరణ కావడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కొణిజర్ల, సెప్టెంబరు 2 : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని బస్వాపురంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) గోడలకు విద్యుత్‌ ప్రసరణ కావడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదు. సోమవారం ఉదయం పాఠశాలలోని రెండు గదుల్లో గోడల నుంచి విద్యుత్‌ షాక్‌ వస్తుండటంతో బాలికలు ఆందోళనకు గురై తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


వారు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ పాఠశాలలో 299 మంది బాలికలు చదువుతున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాశాఖాధికారి మోదుగు శ్యాంసన్‌ సందర్శించారు. గదులు తడవటం వల్ల ఎర్తింగ్‌ సమస్యతో విద్యుత్‌ వస్తోందని, బాలికలు ఆందోళనతో ఇంటికి వెళ్లారని తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 05:31 AM

Advertising
Advertising