ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: మలేషియా పెట్టుబడులకు ప్రోత్సాహం

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:59 AM

ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

మహిళా సంఘాల ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి .. మలేషియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణాలో అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొల్పామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. సోమవారం ఆయన సచివాలయంలో జరిగిన మలేషియా వాణిజ్య ప్రతినిధుల సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తు రంగం, డ్రైపోర్టుల నిర్మాణం, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలకు విదేశాల్లో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే విషయాలను మంత్రి వారితో చర్చించారు. పామాయిల్‌ సేద్యంలో సహకరించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులు, సహకారం లాంటి అంశాలను మంత్రులు ప్రతినిధి బృందానికి వివరించారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 20 మంది మలేషియా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో తెలంగాణలో అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో పూడికతీత, అందులోకి చేరుతున్న మురుగు నీటిని శుద్ధి చేయడంలో అత్యాధునిక సీవరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటులో ప్రతినిధులు పాలు పంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక డ్రై పోర్టు పనులు జరుగుతుండగా మరో రెండు ఏర్పాటు చేేసందుకు ప్రభుత్వం సంకల్పించిందని, వాటి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. కిన్నెరసాని, శ్రీశైలం బ్యాక్‌ వాటర్స్‌ను పర్యాటక ఆకర్షణీయ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రిసార్టులు నిర్మించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక బృందాల సభ్యులుగా ఉన్నారని, వారు తయారు చేసే ఉత్పత్తులు మలేషియాకు ఎగుమతులు చేయాలని, అక్కడ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, ఇక్కడి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించేందుకు మలేషియా ప్రభుత్వంతో వి-హబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


పామాయిల్‌ విత్తనాలు అందించాలి: మంత్రి తుమ్మల

ప్రస్తుతం మలేషియా నుంచి పామాయిల్‌ మొలకలు దిగుమతి చేసుకుంటున్నామని, అలా కాకుండా విత్తనాలు సరఫరా చేయాలని, లేదా ఇక్కడే నర్సరీ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే సహకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. ఎక్కువ ఎత్తు పెరగని, తక్కువ పొడవున్న ఆకులు ఉండే రకాలను అభివృద్థి చేయాలని కోరారు. పామాయిల్‌ నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేయడంలో సహకరించాలని ఆయన విన్నవించారు.


28న చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభం

ఈనెల 28న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌ బాబు సోమవారం తన నివాసంలో సమీక్షించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌ రెడ్డి, ప్రభాకర్‌, తాడూరి శ్రీనివాస్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేషన్‌ విస్తరణకు అవసరమైన టీజీఐఐసీ, రెవెన్యూ, అటవీ భూములను కేటాయిస్తామని శ్రీధర్‌ బాబు వెల్లడించారు. రాంపల్లి వైపు రోడ్డు నిర్మాణం, లైట్ల ఏర్పాటును త్వరతిగతిన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిదిని మంత్రి ఆదేశించారు. మరో కార్యక్రమంలో అమీర్‌పేటలోని ఎంపీఎం గ్రాండ్‌ కాంప్లెక్స్‌లో వెల్‌ వర్క్‌ సంస్థ ఏర్పాటుచేసిన 400 సీట్ల కోవర్కింగ్‌ స్పేస్‌ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు.

Updated Date - Dec 24 , 2024 | 03:59 AM