Engineering Admissions: ఇంజనీరింగ్‌లో ఏఐ, డేటా సైన్స్, ఐటీదే హవా
ABN, Publish Date - Aug 01 , 2024 | 03:50 AM
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈసారీ కంప్యూటర్స్ అనుబంధ కోర్సుల్లో హవా కొనసాగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ.. విభాగాల్లో సీట్లు దాదాపు పూర్తయ్యాయి.
కంప్యూటర్స్ అనుబంధ 17 కోర్సుల్లో 98ు సీట్లు భర్తీ .. ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్స్‌లోనూ పోటాపోటీ
ఇంజనీరింగ్‌లో రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి
హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఈసారీ కంప్యూటర్స్ అనుబంధ కోర్సుల్లో హవా కొనసాగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ.. విభాగాల్లో సీట్లు దాదాపు పూర్తయ్యాయి. రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక కంప్యూటర్స్ అనుబంధంగా ఉన్న 17 కోర్సుల్లో 61,329 సీట్లలో 60,173 (98.12ు) సీట్లు భర్తీ అయ్యాయి. 1,156 సీట్లే మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 29,462 సీట్లుండగా.. 29,074 (98.68ు) సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎంఐలో 14,081 సీట్లకు 13,778 (97.85ు), సీఎస్ డేటా సైన్స్‌లో 7985 సీట్లకు 7,769 (97.29ు), ఐటీలో 4,069 సీట్లకు 4,025 (98.92ు), సైబర్ సెక్యూరిటీలో 1,621 సీట్లకు 1,580 (97.47ు), సీఎస్ ఏఐ, డేటా సైన్స్‌లో 1,479 సీట్లకు 1,424 (96.28ు), ఏఐ, ఎంఎల్ ఇంజనీరింగ్ 924కు 895 (96.86ు) సీట్లు భర్తీ అయ్యాయి.
సీఎ్‌సతోపాటు ఎలక్ర్టానిక్స్, ఎలక్ర్టికల్ విభాగాల్లోనూ ఈసారి డిమాండ్ నెలకొంది. ఇందులోని మొత్తం 9 విభాగాల్లో కోర్సులుండగా.. 16,573 సీట్లకు 14,895 (89.88ు) సీట్లు భర్తీ అయ్యాయి. బయో మెడికల్, ఎలక్ర్టానిక్స్ కమ్యూనికేషన్ ఇన్‌స్ర్టుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ టెలీమెటిక్స్, ఎలక్ర్టానిక్స్ వీఎల్‌ఎ్‌సఐ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్‌స్ర్టుమెంటేషన్ కోర్సుల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి.
ఏరోనాటికల్, మెక్‌ట్రానిక్స్, ఆటోమొబైల్, మెటలర్జికల్, మాన్యుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్‌లో సీట్లన్నీ భర్తీ కాగా.. మెకానికల్‌లో 3,370 సీట్లకు 2,331 (69.17ు), సివిల్‌లో 3,560 సీట్లలో 2,797 (78.57ు) పూర్తయ్యాయి. ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్‌లో 4,731 సీట్లకు 3,625 సీట్లు (76.62ు) భర్తీ అయ్యాయి. ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్‌లో 69 సీట్లు ఉండగా 23, బయో టెక్నాలజీలో 102 సీట్లకు 62 మాత్రమే భర్తీ అయ్యాయి. మైనింగ్, టెక్స్‌టైల్‌లో సగం కూడా భర్తీ కాలేదు.
రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి...
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత సీట్ల కేటాయింపు బుధవారం పూర్తయింది. 175 ఇంజనీరింగ్ కళాశాలల్లో 86,509 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా.. ఇందులో రెండు విడతల్లో మొత్తం 81,490 సీట్ల కేటాయింపు పూర్తయింంది. ఇంకా 5,019 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోస్గీలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 68, 18 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని కళాశాలల్లో 893, రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 15, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 4,043 ఖాళీగా ఉన్నాయి. 7 విశ్వవిద్యాలయాలతోపాటు 80 ప్రైవేటు కాలేజీల్లో 100శాతం సీట్లు పూర్తయ్యాయని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. రెండో విడతలో సీట్లు ఖరారైన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్టు2లోపు పూర్తి చేయాలని కోరారు. చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు8 నుంచి ప్రారంభం కానుండగా.. ఆగస్టు13న సీట్లను కేటాయించనున్నారు.
Updated Date - Aug 01 , 2024 | 03:50 AM