ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Etala Rajender: మోదీ వల్లే భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్న ప్రపంచ దేశాలు

ABN, Publish Date - Mar 14 , 2024 | 01:15 PM

దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రపంచ దేశాలన్నీ మోదీకి రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతున్నాయని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌(Etala Rajender) పేర్కొన్నారు.

- బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌

హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రపంచ దేశాలన్నీ మోదీకి రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతున్నాయని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌(Etala Rajender) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్సూరాబాద్‌- బండ్లగూడ రోడ్డులోని మహవీర్‌ హరిణ వనస్థలి పార్కులో మార్నింగ్‌ వాకర్స్‌తో సమావేశం నిర్వహించారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని వాకర్స్‌ను కోరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మరోసారి మోదీ ప్రభుత్వమే రావాలని దేశమంతా కోరుకుంటుందని, రాష్ట్రంలోనూ మెజారిటీ సీట్లు బీజేపీయే గెలుచుకోబోతుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి సురేందర్‌నాథ్‌యాదవ్‌, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యకార్యకర్తలతో సమావేశం..

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ డిజిటల్‌ విప్లవాన్ని ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మోదీదేనన్నారు. మూడో సారి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రజలు తమ ఓటు హక్కుతో ఆశీర్వదించాలన్నారు. పార్టీ అసెంబ్లీ కన్వీనర్‌ కొత్త రవీందర్‌గౌడ్‌, కళ్లెం రవీందర్‌రెడ్డి, వనిపల్లి శ్రీనివా్‌సరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, నర్సింహగుప్తా, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, పవన్‌కుమార్‌, నవజీనవ్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 01:15 PM

Advertising
Advertising