ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Floods: విల్లాల విలవిల!

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:48 AM

నగరంలో కాలుష్య కోరలు.. చెవులు బద్ధలయ్యే ట్రాఫిక్‌ చప్పుళ్ల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చనే ఆశతో కోట్లు వెచ్చించి విల్లాలు కొన్న వారికి ఇప్పుడా ప్రశాంతతే కరువువైంది!

  • మోకిలాలో ‘లా పోలామా’లో మోకాలి లోతు నీళ్లు

  • మొత్తంగా 212 విల్లాలు.. వరదతో దారులు బంద్‌

  • 2 మోటార్లతో నీరు తొలగింపు.. ప్రహరీ కూడా బద్దలు

  • నాలాకు అడ్డుగా నిర్మించడంతోనే ఈ సమస్య!

చేవెళ్ల, సెప్టెంబరు 2: నగరంలో కాలుష్య కోరలు.. చెవులు బద్ధలయ్యే ట్రాఫిక్‌ చప్పుళ్ల నుంచి దూరంగా పచ్చని ప్రకృతి మధ్య ఇల్లు ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చనే ఆశతో కోట్లు వెచ్చించి విల్లాలు కొన్న వారికి ఇప్పుడా ప్రశాంతతే కరువువైంది! రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలా గ్రామ పరిధిలోని అత్యంత విలాసవంతమైన ‘లా పొలామా’ కమ్యూనిటీలోకి వరద ముంచెత్తింది. ఇక్కడ 212 విల్లాలున్నాయి. మొత్తంగా వెయ్యిమంది దాకా ఉంటున్నారు. ఇక్కడ రూ.3 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.6 కోట్ల దాకా వెచ్చించి విల్లాలు కొనుక్కున్నారు. పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావాలతో హాయి గొలిపే ఆ కమ్యూనిటీలో భారీ వర్షాల కారణంగా మోకాలి లోతు వరద నిలిచింది.


లోపల రోడ్లన్నీ మునిగిపోయి చెరువును తలపించాయి. కమ్యూనిటీలోకి వెళ్లే దారులన్నీ బంద్‌ అయ్యాయి. లోపల 12 విల్లాల్లోకైతే ఇళ్లలోకి కూడా నీళ్లొచ్చాయి. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సోమవారం ‘లా పొలామా’కొచ్చారు. ప్రత్యేకంగా రెండు మోటార్లను ఏర్పాటు చేయించడంతో నీటిని సిబ్బంది బయటకు పంపారు. వరద తొలగింపునకు ‘లా పొలామా’ ప్రహరీని యంత్రాలతో కొంతమేర పగులగొట్టడం గమనార్హం. కాగా నాలా ప్రవాహానికి అడ్డంగా ఈ విల్లాలను నిర్మించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీ వర్షం పడినప్పుడల్లా కొండకల్‌, కొండకల్‌ తండా గ్రామాల వైపు ఉన్న నాలాలోకి వెళ్లాల్సిన ప్రవాహం నిలిచిపపోయి.. ఆ వరద నీరంతా కమ్యూనిటీలోకి పొంగుతోందని.. ఈసారి వర్షం ఎక్కువడగా పడటంతో సమస్య ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 03:48 AM

Advertising
Advertising