ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మృత్యు పిడుగులు..

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:14 AM

వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

  • రాష్ట్రంలో 8 మంది దుర్మరణం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 3గంటల తర్వాత పలుచోట్ల వర్షం పడింది. రోడ్లపై వరద చేరడం, ఫలితంగా ట్రాఫిక్‌జాంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 7సెం.మీ, ఇదే జిల్లా పెద్దకొత్తపల్లిలో 6.9, సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 5, మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో 4.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.


నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలం కాల్వ గ్రామానికి చెందిన మోడపెల్లి ప్రవీణ్‌(25) పొలం నుంచి ఇంటికి వెళుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. ఇదే జిల్లా తానూర్‌ మండలం ఎల్వత్‌ గ్రామానికి చెందిన మాగిర్వాడ్‌ శ్రీ (12) శివార్లో మేకలు కాస్తుండగా, నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దండిగుట్టకు చెందిన బానోత్‌ పీర్యా నాయక్‌(65) గేదెలు కాస్తుండగా పిడుగుపడటంతో మృతిచెందారు. మెదక్‌ జిల్లాలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. హవేళీఘణ్‌పూర్‌ మండలం శమ్మాపూర్‌కు చెందిన శెట్టబోయిన సిద్దయ్య(48), ఓరగంటి నందు(23) పూరిగుడెసె నిర్మాణానికి పొరక తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లగా పిడుగు పడటంతో మృతిచెందారు.


ఇదే జిల్లా కౌడిపల్లి మండలం పీర్లతండాకు చెందిన ధలావత్‌ గేమ్యా నాయక్‌(53) పశువులను మేపుతుండగా పిడుగు పడి చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పిచేర్యాగడికి చెందిన గోపాల్‌(38) పొలం వద్ద ఉండగా పిడుగు పడటంతో మృతిచెందాడు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌కు శివార్లోని పొలంలో పత్తిగింజలు నాటుతుండగా పిడుగు పడి కొమ్మరెక్క జంగమ్మ(45) మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌ శివార్లో పిడుగుపడటంతో ఎద్దు మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తూర్పుచౌలపల్లిలో పిడుగుపడి ఆవు మృతిచెందింది.

Updated Date - Jun 07 , 2024 | 04:14 AM

Advertising
Advertising