ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farmers: పత్తి రైతుల ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్‌

ABN, Publish Date - Jun 02 , 2024 | 03:08 AM

ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనాల కోసం పత్తి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలకు దిగుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

  • ఆదిలాబాద్‌ జిల్లాలో ఏఈవోపై వేటు

ఆదిలాబాద్‌, జూన్‌1 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లాలో విత్తనాల కోసం పత్తి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలకు దిగుతుండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం రాశి-659 విత్తనాలు దొరకడంలేదంటూ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌరస్తాలో రైతులు రాస్తారోకోకు దిగారు. జిల్లా కేంద్రానికి చెందిన నిఖిల్‌ ఫెర్టిలైజర్‌ యజమాని విత్తనాలను ఓ వాహనంలో తరలిస్తుండగా రైతులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా దీనిపై విచారణ జరిపిన వ్యవసాయ శాఖాధికారుల నివేదిక ఆధారంగా పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు.


మరోవైపు విధులపట్ల నిర్లక్ష్యం వహించాడన్న కారణంతో యాపల్‌గూడ క్లస్టర్‌ ఏఈవో శివచరణ్‌పై ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటువేశారు. అయితే జిల్లా వ్యవసాయ శాఖాధికారి పుల్లయ్య నిర్లక్ష్యంతోనే విత్తనాల కొరత ఏర్పడిందంటూ తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు.


నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

వరంగల్‌ క్రైం, జూన్‌ 1: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సంగెం మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఒకర్ని పోలీసులు అరెస్టు చేశారు. మరో గ్రామంలో నిషేధిత గడ్డిమందును అమ్ముతున్న మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు సంఘటనల్లో రూ.10లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1.10 లక్షల విలువైన 122 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఈ వివరాలను వెల్లడించారు.

Updated Date - Jun 02 , 2024 | 03:08 AM

Advertising
Advertising