ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Public Opinion: ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వ జీవోలు!

ABN, Publish Date - Jul 16 , 2024 | 02:59 AM

తమ ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలే జీవోలుగా వెలువడుతాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

  • ప్రజలు చెల్లించే పన్నులతోనే పథకాల అమలు

  • అక్రమాలకు తావు లేకుండా రైతు భరోసా

  • రైతుల అభిప్రాయాలపై చట్టసభల్లో చర్చిస్తాం

  • ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ: భట్టి విక్రమార్క

  • ‘ఐటీ’ రైతులకూ రైతుభరోసా: పొంగులేటి

  • బీమా కంపెనీలతో చర్చిస్తున్నాం: తుమ్మల

  • వరంగల్‌ రైతుల అభిప్రాయాల సేకరణ

వరంగల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలే జీవోలుగా వెలువడుతాయని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజల అభిప్రాయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉపాధి హామీ కూలీలు మొదలుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, ఆ పన్నులతోనే ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘం నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లాల స్థాయి విస్తృత సమావేశాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులతో హనుమకొండ కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలు తీసుకుని పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారని తెలిపారు.


ఇప్పటివరకు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో రైతుల అభిప్రాయాలను స్వీకరించామన్నారు. వీటిపై శాసనసభ, శాసనమండలిలో చర్చించి.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. గతంలో కొండలు, గుట్టలు, ఫాంహౌ్‌సలు, రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు కూడా రైతుబంధు ఇచ్చినట్టుగా నివేదికలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తమ ప్రజా ప్రభుత్వంలో అలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన రైతులకు రైతు భరోసా అందించడంపై సీఎం దృష్టి పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ వరంగల్‌ నుంచే ప్రకటించారని గుర్తుచేస్తూ.. ఇక్కడి రైతులు చెప్పిన విలువైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.


ఆదాయ పన్ను చెల్లించే రైతులకూ రైతుభరోసా..

అదాయ పన్ను (ఐటీ) చెల్లిస్తున్న రైతులకు రైతుభరోసా ఇవ్వరంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఐటీచెల్లించడం వేరు.. రిటర్న్స్‌ దాఖలు చేయడం వేరు అని, ఈ విషయంలో తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని చెప్పారు. చిన్న చిన్న వ్యాపారాలతో, తక్కువ ఆదాయ పన్ను చెల్లించేవారిని రైతుభరోసాకు దూరం చేయకుండా విధి విధానాలు రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆగస్టులో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని పునరుద్ఘాటించారు. పంట నష్టాలకు సంబంధించి బీమా కంపెనీలతో చర్చిస్తున్నామన్నారు.


ధరణి పేరుతో పేదల భూములు మాయం..

గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములను దోచుకుందని, ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా లాక్కుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. పంటలకు బీమా చేసినట్లే.. పశువులకు కూడా బీమాను వర్తింపజేస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మరో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుభరోసాతో లోపాలకు తావుండదని, పేద రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.

Updated Date - Jul 16 , 2024 | 03:00 AM

Advertising
Advertising
<