Bandi Sanjay: బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్ 1 అభ్యర్థులు
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:34 PM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను గ్రూప్-1 అభ్యర్ధులు కలిశారు. గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు.
కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను గ్రూప్-1 అభ్యర్ధులు కలిశారు. గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని సైతం నిరుద్యోగులు గుర్తు చేశారు.
గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండటంవల్ల 1: 50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని బండి సంజయ్ వారికి హామీ ఇచ్చారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ జూన్ 9వ తేదీన నిర్వహించి.. దీనికి సంబంధించిన ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది.
Updated Date - Jun 20 , 2024 | 12:34 PM