Siddipet: ఆటవిడుపుగా హరీశ్ బోట్ డ్రైవ్
ABN, Publish Date - May 13 , 2024 | 04:35 AM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.
కోమటి చెరువు వద్ద ఆహ్లాదంగా గడిపిన మాజీ మంత్రి
సిద్దిపేట టౌన్, మే 12: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామారెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి కోమటి చెరువుపై నున్న సస్పెన్షన్ బ్రిడ్జిపై వాకింగ్ చేశారు. బగ్ వాహనం నడుపుతూ అభిమానులు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. స్వయంగా బోట్ డ్రైవ్ చేస్తూ సరదాగా గడిపారు. చెరువు కట్టపై పర్యాటకులతో కలిసి మ్యూజిక్ లైటింగ్, లేజర్ షోను తిలకించారు. హరీశ్‌రావును కలిసిన పలువురు పర్యాటకులు, అభిమానులు, చిన్నారులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
Updated Date - May 13 , 2024 | 04:35 AM