ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Harish Rao : కేసీఆర్‌ను తిట్టకుంటే రోజు గడవదా?

ABN, Publish Date - Sep 18 , 2024 | 04:02 AM

మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పొద్దు గడవం లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు.

  • రాష్ట్రానికి రేవంత్‌ చేసేది మేలా లేక కీడా?

  • అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు

  • అబద్ధాల పునాదుల పైనే రాష్ట్ర ప్రభుత్వం

  • జై తెలంగాణ అననోళ్ల నివాళితో అమరుల ఆత్మఘోష.. మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

మెదక్‌, సెప్టెంబరు 17: మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పొద్దు గడవం లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంపై బురద జల్లుతూ సీఎం రేవంత్‌ రాజకీయాలు చేస్తున్నారని, అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న రేవంత్‌ రెడ్డి తన పాలనతో రాష్ట్రానికి మేలు చేస్తున్నారా ?కీడు చేస్తున్నారా ? అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ మేరకు మెదక్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన హరీశ్‌ రావు.. ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాలన చేయాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని సూచించారు.

అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నివాళులర్పించిన నేతలంతా ఒకప్పుడు ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో దానం నాగేందర్‌ పోషించిన పాత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇక, నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘటన ప్రస్తుత సీఎం రేవంత్‌ సొంతమన్నారు. జై తెలంగాణ అని నినదించని వాళ్లు శ్రద్ధాంజలి ఘటిస్తే అమరులు ఆత్మలు ఘోషిస్తాయని హరీశ్‌ చెప్పారు. కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రెట్టింపు చేసి చూపెట్టి సీఎం రేవంత్‌ రెడ్డి 16వ ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.


అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. 2024 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా గత ప్రభుత్వంపై నెడుతున్నారని వాపోయారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.26 లక్షల కోట్లని తానే అసెంబ్లీలో స్వయంగా చెప్పానని హరీశ్‌ గుర్తు చేశారు. కానీ, ప్రజా పాలన సభలో రేవంత్‌ రెడ్డి తన ప్రసంగంలో రూ. 7లక్షల కోట్లు అప్పులు చేశామని చెప్పడం ఎంత వరకు సమంజసం అని హరీశ్‌ నిలదీశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీస్తే రేవంత్‌ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడిపోతారని హెచ్చరించారు. ఇక, 2013-14లో రూ.1,43,739 కోట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.3,47,221 కోట్లకు పెరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ తాగు నీళ్లు సరఫరా చేశామని, ఆ అంశంపై రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు సుపరిపాలన అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచన చేశారు.

Updated Date - Sep 18 , 2024 | 04:02 AM

Advertising
Advertising