ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

ABN, Publish Date - Oct 08 , 2024 | 04:39 AM

కరీంనగర్‌లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్‌ఎస్‌ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

  • కరీంనగర్‌లో ఇళ్ల స్థలాల రద్దుపై హరీశ్‌రావు నిలదీత

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్‌ఎస్‌ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే దసరా కానుక ఇదేనా? అని ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం నిలదీశారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగల్చడం శోచనీయమన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి ఇది మరో నిదర్శనమని మండిపడ్డారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల రద్దు ప్రకటనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 08 , 2024 | 04:39 AM