ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao : తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా9 మందిని కాపాడలేకపోయారు

ABN, Publish Date - Sep 04 , 2024 | 05:22 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్‌నగ్‌ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే హరీశ్‌రావు విమర్శించారు.

  • సహాయ చర్యల్లో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలం.. సీఎం రేవంత్‌ పాలనపై పట్టు కోల్పోయారు

  • బాధితులకు రూ.10వేలు ఇస్తామనడం సిగ్గు చేటు

  • ఖమ్మంలో మున్నేరు బాధితులకు హరీశ్‌ పరామర్శ

  • సాయం కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచన

ఖమ్మం టౌన్‌/నడిగూడెం, సెప్టెంబరు 3: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్‌నగ్‌ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే హరీశ్‌రావు విమర్శించారు. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వరదల సమయంలో సహాయ కార్యక్రమాల కోసం కనీసం ఒక హెలికాప్టర్‌ను కూడా అందుబాటులోకి ఉంచలేకపోయిందన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ ప్రతినిఽధుల బృందం ఖమ్మంలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడి పరామర్శించింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు, జగదీశ్వర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌ మాట్లాడారు.

రాష్ట్రంలో వరదల్లో 30మంది చనిపోతే సీఎం రేవంత్‌రెడ్డి 16మంది చనిపోయారని చెప్పి వరద రాజకీయం చేస్తున్నారని హరీ్‌షరావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు సహాయ చర్యల్లో విఫలం కావటంతో సీఎం సమీక్షలు నిర్వహించారని, ఆ సమీక్షల్లోనూ ప్రతిపక్షాలను తిట్టడం తప్ప సహాయ చర్యలపై ఏం నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. పరిపాలనపై పట్టు కోల్పోయిన సీఎం ప్రతిపక్షాలపై బురదజల్లుతున్నారన్నారు.

వరద బాధిత కుటుంబాలకు కేవలం రూ.10వేలు అందచేస్తామని రేవంత్‌ ప్రకటించడం సిగ్గుచేటని హరీశ్‌ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇండ్లు కోల్పోయినవారికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన తమపై పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ గూండాలు దాడిచేశారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రఽఽధాని మోదీని కలిసి వరద నష్టం సాయంపై నిలదీయాలని హరీశ్‌రావు సూచించారు. ఢీల్లీకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.


తూములు మూసి వెల్డింగ్‌ చేయడం వల్లే

సూర్యాపేట జిల్లా వరదలతో పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు, ఇసుక మేటల తొలగింపునకు రూ.50వేలు పరిహారం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నడిగూడెం మండలం కాగిత రాంచంద్రాపురం వద్ద నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడిన ప్రదేశాలను హరీశ్‌రావు, జగదీశ్వర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాల్వకు గండిపడిందని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సాగర్‌ కాల్వకు గండి ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. ఎండాకాలంలో తాగునీటి కోసం ఖమ్మం జిల్లా మంత్రులు సాగర్‌ నీటిని ఎడమ కాల్వ ద్వారాపోలీస్‌ పహారా మధ్య పాలేరుకు తరలించి గండికి కారణమయ్యారని జగదీశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో షట్టర్లు, తూములు మూసివేసి వెల్డింగ్‌ చేసి వదిలివేయడంతోనే తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పాలేరు బ్యాక్‌ వాటర్‌, సాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల ఉధృతి పెరిగినప్పటికీ షట్టర్లు తెరవకపోవడంతో కాల్వకు భారీ గండ్లు పడ్డాయన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 05:22 AM

Advertising
Advertising