ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: తక్కువ ధరకే భూములు లాక్కునే కుట్ర

ABN, Publish Date - Dec 08 , 2024 | 04:33 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం (ఆర్‌ఆర్‌ఆర్‌)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు ఆరోపించారు.

  • హరీశ్‌రావు ఎదుట ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితుల ఆవేదన

  • ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

హైదరాబాద్‌/నార్సింగ్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం (ఆర్‌ఆర్‌ఆర్‌)లో భాగంగా తక్కువ ధరకే తమ భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని పలువురు బాధితులు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు.. తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం పుప్పాల్‌గూడలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవించారు.


ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ట్రిపుల్‌ ఆర్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. బాధితులకు న్యాయం చేయకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న 4,016 రూపాయల పెన్షన్‌ను ఆరువేల రూపాయలకు పెంచాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈనెల 26న జరగనున్న దివ్యాంగుల మహా ధర్నాకు తాను తప్పనిసరిగా హజరవుతానని తనను కలిసిన దివ్యాంగుల సంఘం నాయకులకు ఆయన హమీ ఇచ్చారు.

Updated Date - Dec 08 , 2024 | 04:33 AM