Harish Rao: ఓటు హక్కును వినియోగించుకున్న హరీశ్ రావు.. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం
ABN, Publish Date - May 13 , 2024 | 10:46 AM
ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సిద్దిపేట: ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. "నేను కుటుంబ సభ్యులతో కలిసి భారత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు. గతం కంటే పట్టణాలలో పోలింగ్ పెరుగుతోంది. ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మేధావులు,విద్యావంతులు పోలింగ్లో పాల్గొనాలి. ప్రజాస్వామ్యం బలపడాలంటే అందరూ ఓటు వేయాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకువాలి" అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓటింగ్లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి
కృష్ణాజిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా పోలీసులకు విధులు
వైసీపీ.. నాడు ధీమా.. నేడు డీలా!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 13 , 2024 | 10:46 AM