ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయ తోరణం తొలగించడానికి కుట్రలు: హరీష్‌రావు

ABN, Publish Date - May 23 , 2024 | 07:46 PM

ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) అన్నారు.కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని ఆరోపించారు. రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

Harish Rao

హనుమకొండ: ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని ఆరోపించారు. రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్, అమలు చేయడాన్ని విస్మరించిందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.


వర్దన్నపేట నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్‌లో లాఠీఛార్జి చేయడం సిగ్గుచేటన్నారు. వడ్లకు బోనస్ ఎగ్గొట్టిన కాంగ్రెస్‌కు రైతు బిడ్డలు బుద్ధి చెప్పాలన్నారు. కరెంట్, రిజిస్ట్రేషన్ ఫీజు, భూముల ధరలు పెంచే యోచన రేవంత్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి వాత పెట్టాలన్నారు.


తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్‌ను బలపర్చాలన్నారు.తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌కు పట్ట భద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించాలని బీజేపీ కుట్రలు చేస్తుంటే కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయ తోరణం తొలగించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓరుగల్లు బిడ్డలారా పౌరుషం చూపించాలి.. ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 08:53 PM

Advertising
Advertising