ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao,: ప్రజా సమస్యల కంటే అల్లు అర్జున్‌ విషయం ముఖ్యమా?:హరీశ్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 03:37 AM

రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్‌ విషయం ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

మెదక్‌ అర్బన్‌/వరంగల్‌ మెడికల్‌/హనుమకొండ టౌన్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్‌ విషయం ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సోమవారం వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో 24 అంతస్థులతో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని, మెదక్‌ జిల్లా కేంద్రంలోని చర్చిని ఆయన సందర్శించారు. హనుమకొండలో, మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులతో మాట్లాడి.. వారి ఆందోళనకు మద్దతు పలికారు.


ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్‌ రావు మాట్లాడుతూ.. సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. సినీ హీరో అల్లు అర్జున్‌ గురించి అసెంబ్లీలో బాగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. స్వగ్రామంలోని తన తమ్ముడు తిరుపతిరెడ్డి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు.

Updated Date - Dec 24 , 2024 | 03:37 AM