ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao: సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం సరికాదు

ABN, Publish Date - May 21 , 2024 | 05:02 PM

తెలంగాణ రాష్ట్రంలో బోనస్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో తేనె తుట్టెను కదిలించినట్టు అయ్యింది. ఇదే అంశంపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చి సన్న వడ్డకు మాత్రమే ఇస్తాననడం సరికాదని గుర్తుచేశారు.

Harish Rao

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బోనస్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో తేనె తుట్టెను కదిలించినట్టు అయ్యింది. ఇదే అంశంపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని హరీశ్ రావు (Harish Rao) గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చి సన్న వడ్డకు మాత్రమే ఇస్తాననడం సరికాదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది. అన్నింటికి బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్ల భారం పడుతుంది. అందుకోసం సన్నం వడ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని హరీశ్ రావు విమర్శించారు. ఇలా చేస్తే రూ.400 కోట్ల మాత్రమే ఖర్చవుతుందని వివరించారు.


కారణమిదేనా..?

యాసంగిలో రైతులు సన్నం వడ్లు పండించరని హరీశ్ రావు గుర్తుచేశారు. పండించని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బోనస్‌ ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసిందని విమర్శింంచారు. రైతు భరోసా కింద ఎకరాకు ప్రభుత్వం రూ.2500 ఇవ్వాల్సి ఉందన్నారు. వానాకాలానికి సంబంధించి ఎకరానికి 15 వేల రైతు భరోసాతోపాటు యాసంగి బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దొడ్డు వడ్లు కొంటారా? కొనరా? కొంటె ఎప్పటి నుంచి కొంటారో చెప్పాలని సూటిగా అడిగారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని తేల్చి చెప్పారు. ఇతర పంటల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.



Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2024 | 05:02 PM

Advertising
Advertising