ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jeevan Reddy: హరీశ్‌.. ఇక రాజీనామా చెయ్‌!

ABN, Publish Date - Jul 19 , 2024 | 03:54 AM

కాంగ్రెస్‌ సర్కారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

  • ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అడ్లూరి డిమాండ్‌

జగిత్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి, అడ్లూరి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. రుణమాఫీతో 60 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు.


హరీశ్‌రావు హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని, రాజీనామా పత్రం ఫార్మాట్‌ను జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ తరఫున పంపిస్తామని చెప్పారు. నాడు వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరుగుతోందని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకోవాలని కోరారు. రుణమాఫీ రైతు లోకానికి శుభసూచకమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. రుణమాఫీ అమలు విషయంలో ప్రతిపక్షాలు సహకరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు.

Updated Date - Jul 19 , 2024 | 03:54 AM

Advertising
Advertising
<