ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harishrao: కాంగ్రెస్‌పై చీటింగ్ కేసు పెట్టాలి... సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

ABN, Publish Date - Apr 08 , 2024 | 10:05 PM

కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు గెలవడానికి 6 గ్యారంటీలు కోసం బాండ్ పేపర్ల మీద రాసిచ్చారని అన్నారు.


BRS: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు

రేవంత్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. 2500 వందలకు వడ్లు కొంటానని రైతులను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చే రైతు బంధును సీఎం రేవంత్ రెడ్డి ఆపారని నూ. 15 వేలు ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు.


మహిళలకు రూ.2500 ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తే మహిళలు చీపురుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక నియోజకవర్గం ప్రజలను మోసం చేయడంతో 54 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 08 , 2024 | 10:05 PM

Advertising
Advertising