Medaram: మేడారం ప్రధాన పూజారి మృతి..
ABN, Publish Date - Jul 21 , 2024 | 05:01 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.
మేడారం, జూలై 20: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. డిశ్చార్చ్ అయ్యాక తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన శనివారం ఉదయం మృతి చెందారు. ముత్తయ్యకు భార్య నాగమణి, కూతురు సాయిప్రసన్న, కొడుకు సాయిచరణ్ ఉన్నారు.
ముత్తయ్య మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మేడారం మహాజాతరలో వనదేవతలను గద్దెలకు తీసుకొచ్చే క్రమంలో సమ్మక్క పూజా కార్యక్రమాల్లో ముత్తయ్య కీలకపాత్ర పోషించేవారు. జాతర సమయంలో మహాఘట్టం ప్రారంభం నుంచి చిలకలగుట్ట పైకి వెళ్లి కుంకుమ భరణి తీసుకురావడం, దేవతను వనప్రవేశం తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
Updated Date - Jul 21 , 2024 | 05:01 AM