ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Transfers: వైద్య సేవలకు ఆటంకం లేకుండా బదిలీలు

ABN, Publish Date - Aug 09 , 2024 | 03:05 AM

వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, సిబ్బంది బదిలీలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.

  • ఉస్మానియా, గాంధీల్లో వైద్యుల కొరత లేదు

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, సిబ్బంది బదిలీలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. జూలై 3న జారీ చేసిన జీఓ నెంబర్‌ 80 ప్రకారం బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది సరిపడా ఉన్నారని తెలిపారు.


బదిలీల కారణంగా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎలాంటి ప్రభావం పడలేదని వివరించారు. మార్చి నెలలో వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన నియమించామని, మరికొంత మంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని వివరించారు.

Updated Date - Aug 09 , 2024 | 03:05 AM

Advertising
Advertising
<