Share News

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్‌డేట్

ABN , Publish Date - May 10 , 2024 | 12:18 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది.

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్‌డేట్

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నమోదయిన మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఆమె తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు..

AP Elections 2024: తుది దశకు చేరుకున్న ఎన్నికల పోరు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 12:21 PM