ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:13 AM

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

  • రెండ్రోజుల్లో దిగువకు నీటిని వదిలే చాన్స్‌

  • తుంగభద్రకు 27 వేల క్యూసెక్కులు..

  • మేడిగడ్డకు 41 వేల క్యూసెక్కుల ప్రవాహాలు

హైదరాబాద్‌/గద్వాల/మహదేవపూర్‌రూరల్‌/బయ్యారం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... 81.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ జలాశయం నిండితే తెలంగాణ కీలక ప్రాజెక్టులకు నీరు విడుదల కానుంది. రెండ్రోజుల్లో ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు 27,544 క్యూసెక్కుల వరద వచ్చింది.


తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,256 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గోదావరి బేసిన్‌లోని మేడిగడ్డ బ్యారేజీకి 41 వేల క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీకి 64 వేల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 66 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 650 క్యూసెక్కులు, సుందిళ్లకు 956 క్యూసెక్కుల వరద రాగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి 396 క్యూసెక్కులు, కడెం 464 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,852 క్యూసెక్కులు, సింగూరులకు 300 క్యూసెక్కుల వరద రికార్డయింది.

Updated Date - Jul 11 , 2024 | 04:13 AM

Advertising
Advertising
<