ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Alert: నేడు భారీ వర్షాలు..

ABN, Publish Date - Sep 24 , 2024 | 03:10 AM

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

  • నిండుకుండల్లా జలాశయాలు

  • 589.30 అడుగుల వద్ద సాగర్‌ నీటిమట్టం

  • పూర్తిగా నిండిన సింగూరు జలాశయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట్‌, గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం హైదరాబాద్‌లోని చార్మినార్‌ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.


మరోవైపు సాగర్‌ నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 589.30 అడుగులు ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 14,846 కూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతోంది. కుడికాల్వ ద్వారా 10,120 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 2,715 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరదకాల్వ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 44,020 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుండగా ఎగువ నుంచి 14,846 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.


అలాగే నల్లగొండ- సూర్యాపేట జిల్లాల సరిహద్దుల్లోని మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 319.11 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గల పులిచింతల ప్రాజెక్టు ఒక గేటు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 174.86 అడుగులుగా ఉంది. సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు 11,656 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దాంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 07:52 AM