Sai Durga Tej: తల్లిదండ్రులూ.. జాగ్రత్త!
ABN, Publish Date - Jul 08 , 2024 | 04:30 AM
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు పోస్టు చేయొద్దు
సోషల్ మీడియా ముసుగులో క్రూర మృగాలు ఉన్నాయి
ఓ యూట్యూబర్ వ్యాఖ్యలపై తెలంగాణ,
ఏపీ సీఎంలకు హీరో సాయి దుర్గా తేజ్ ఫిర్యాదు
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి. వారు మీ పిల్లల ఫొటోలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తారు.. మార్ఫింగ్ చేస్తారు. పేరెంట్స్ ఆ వ్యక్తులు చేసే కామెంట్స్ వల్ల ఎంత ఇబ్బందిని అనుభవిస్తారో, ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతారో వారికి అర్థం కాదు’ అని పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ పోస్ట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే సాయి దుర్గాతేజ్ మరో ట్వీట్‌లో ఓ వీడియోను షేర్ చేసి సంబంఽధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను, పోలీసులను కోరారు. ఇందులో ప్రణీత్ హనుమంతు అనే ఓ యూట్యూబర్.. కొంతమంది యూట్యూబర్లతో కలిసి ఓ తండ్రి, తన చిన్నారి కూతురు వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు.
స్పందించిన రేవంత్, భట్టి విక్రమార్క, మంచు మనోజ్
ఈ పోస్ట్‌పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.. సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ పోస్ట్‌పై స్పందించారు. ‘ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన సహించరానిదని.. వీరిని ఊరికే వదిలిపెట్టకూడద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- సినిమా డెస్క్
Updated Date - Jul 08 , 2024 | 04:30 AM