ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: పంచాయతీల విలీనం ఆర్డినెన్స్‌పై ‘స్టే’ కు హైకోర్టు నిరాకరణ

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:32 AM

పలు పంచాయతీలను సమీప మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై స్టే విధించడానికి హైకోర్టు కోర్టు నిరాకరించింది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పలు పంచాయతీలను సమీప మున్సిపాల్టీల్లో విలీనం చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై స్టే విధించడానికి హైకోర్టు కోర్టు నిరాకరించింది. శంషాబాద్‌ మండల పరిధిలోని ఘన్సిమయాగూడ గ్రామపంచాయతీని శంషాబాద్‌ మున్సిపాల్టీలో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ టి. సిద్ధయ్య తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా విలీనం చేశారని పిటిషనర్‌ పేర్కొన్నారు.


పంచాయతీని మున్సిపాల్టీలో విలీనం చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ఽధర్మాసనం ప్రశ్నించింది. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, సౌకర్యాలు పెరుగుతాయని, ప్రజల జీవితాలు, జీవనశైలి మెరుగుపడతాయని పేర్కొంది. ప్రజల ప్రయోజనం కంటే వ్యక్తిగత ప్రయోజనం కోసం పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఆర్డినెన్స్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.

Updated Date - Sep 13 , 2024 | 03:32 AM

Advertising
Advertising