ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఐఏఎస్‌ వ్యక్తిగత అభిప్రాయాలతో ప్రభుత్వ విధానాలు మారుతాయా?

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:01 AM

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని హైకోర్టు అభిప్రాయపడింది.

  • హైకోర్టు.. స్మితాసబర్వాల్‌పై పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలతో చట్టాలు, ప్రభుత్వ విధానాలు మారిపోవని అభిప్రాయపడింది. దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్లు కూడా రద్దుకావని వ్యాఖ్యానించింది. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, వాటిని వెల్లడించవచ్చని, అందుకు రాజ్యాంగంలోని భావప్రకటనా స్వేచ్ఛ అవకాశం కల్పిస్తోందని పేర్కొంది.


ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి దివ్యాంగులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన స్మితాసబర్వాల్‌పై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్సీకి ఆదేశాలు జారీచేయాలని కొప్పుల వసుంధర అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీఎంఆర్‌ వేలు వాదనలు వినిపిస్తూ స్మితాసబర్వాల్‌ ప్రభుత్వ విధానాలను, రిజర్వేషన్‌లను విమర్శించడం ద్వారా ఆమె సర్వీస్‌ రూల్స్‌ నిబంధనలకు అతిక్రమించారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాలో ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వ విధానాల్లో ఏ మార్పు ఉండదని పేర్కొంది. పరిశీలన దశలోనే ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Sep 03 , 2024 | 05:01 AM

Advertising
Advertising