TS Congress: కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు
ABN, Publish Date - Apr 02 , 2024 | 07:51 AM
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్‌ను హైకమాండ్ మళ్లీ పెండింగ్‌లోనే పెట్టింది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ (Congress) టికెట్‌పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్‌ను హైకమాండ్ మళ్లీ పెండింగ్‌లోనే పెట్టింది. ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు మధ్య పోటీ నెలకొంది. తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తారంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది. వీరు కాకుండా బలమైన నేతల కోసం హైకమాండ్ ఆరా తీస్తోంది. ఇక వరంగల్ టికెట్‌ను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కడియం కావ్యకే కేటాయించింది.
BJP.. కరీంనగర్: బండి సంజయ్ నేడు రైతు దీక్ష
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికను ఆ పార్టీ అధిష్ఠానం పెండింగ్‌లోనే ఉంచింది. ఇప్పటికి మూడు విడతల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగినా ఏ విషయం తేల్చలేదు. తాజాగా సోమవారం జరిగిన సమావేశంలోనూ ఏ నిర్ణయానికి రాలేకపోయారు. ఒకదశలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఖరారయ్యిందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విడతలో రాష్ట్రంలో వరంగల్ అభ్యర్థిని ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
బీఆర్‌ఎస్ కోసం స్పెషల్ టాస్క్!
కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ నుంచి కరీంనగర్ స్థానానికి ప్రవీణ్‌రెడ్డి పేరును మాత్రమే పంపించారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో ప్రవీణ్‌రెడ్డి పేరుతోపాటు వెలిచాల రాజేందర్‌రావు, రుద్ర సంతోష్‌కుమార్, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గ ఇన్‌చార్జి ఏకాభిప్రాయంగా వెలిచాల రాజేందర్‌రావును ప్రతిపాదించారు. దీంతో రాజేందర్‌రావు పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కార్యాచరణ సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఇంతతో సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరునే ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆశించారు. కరీంనగర్ నుంచి తన స్థానాన్ని హుస్నాబాద్‌కు మార్చుకున్న పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించడానికి ప్రవీణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోజు సర్దిచెప్పారు. ఎమ్మెల్సీ పదవికాని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కానీ కల్పిస్తామని హామీ ఇచ్చి ఆయనను అసెంబ్లీ టికెట్ బరి నుంచి ఉపసంహరించుకునేలా చూశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికే కరీంనగర్ పార్లమెంట్ స్థానం అభ్యర్థిత్వం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆయన సూచన మేరకే రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఏకాభిప్రాయంగా ప్రవీణ్‌రెడ్డి పేరు మాత్రమే కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ఢిల్లీ స్థాయిలో మాత్రం పలువురి పేర్లను పరిశీలించి పలు సర్వేలు చేయించుకొని పలు సమావేశాల్లో చర్చించారు. అయినా నిర్ణయానికి రాలేక పోయారు.
Kavitha: జైల్లో జపం చేసుకుంటా!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 02 , 2024 | 07:52 AM