ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HMDA: హాట్ సీటుగా హెచ్ఎండీఏ.. ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు, ఇతర విభాగాల్లో ఖాళీలు

ABN, Publish Date - Jul 25 , 2024 | 12:36 PM

హెచ్‌ఎండీఏ(HMDA)లో ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు ఇతర విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ప్లానింగ్‌ విభాగం సీటులో కూర్చుంటే ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోవచ్చనే ప్రచారం ఉన్నది.

- ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు, ఇతర విభాగాల్లో ఖాళీలు

- డిప్యుటేషన్‌పై వచ్చేందుకు పలువురి ప్రయత్నాలు

హెచ్‌ఎండీఏలో కమిషనర్‌ పోస్టే కాదు.. పలు విభాగాల్లో ఏ పోస్టు అయినా హాట్‌ సీటుగా మారింది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉద్యోగం కావడం.. రాజకీయ ఒత్తిడులు లేకపోవడంతో ఇక్కడ పనిచేసేందుకు పలువురు ఆరాటపడుతున్నారు.

హైదరాబాద్‌ సిటీ: హెచ్‌ఎండీఏ(HMDA)లో ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్టు ఇతర విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. ప్లానింగ్‌ విభాగం సీటులో కూర్చుంటే ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టుకోవచ్చనే ప్రచారం ఉన్నది. గతంలో డిప్యుటేషన్‌(Deputation)పై వచ్చి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిక్కినవారే ఇందుకు ఉదాహరణ. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో జరుగుతున్న బదిలీల్లో భాగంగా డిప్యుటేషన్‌పై హెచ్‌ఎండీఏకు వచ్చేందుకు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు.

ఇదికూడా చదవండి: నగరంలో.. గ‘మ్మత్తు’ పబ్‏లు.. కిలోల లెక్కన డ్రగ్స్‌ దిగుమతి


రాష్ట్ర ఏర్పాటు తర్వాత..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరిగినా.. హెచ్‌ఎండీఏలో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. హెచ్‌ఎండీఏలో 2012లో కొన్ని బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ తర్వాత ఇప్పటి వరకు ఏ పోస్టులనూ భర్తీ చేయలేదు. 600 పోస్టులు ఉన్న హెచ్‌ఎండీఏలో 70 శాతానికి పైగా ఖాళీలున్నాయి. హుడా నుంచి హెచ్‌ఎండీఏగా ఏర్పడినప్పటి నుంచి ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులు రెండింతల పని భారాన్ని మోస్తున్నారు. డిప్యుటేషన్‌ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల అమలుకు ఉద్యోగుల కొరత తీవ్ర అడ్డంకిగా మారుతోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు హద్దుగా చేసుకొని హైదరాబాద్‌ విస్తరణతో భారీగా భవన నిర్మాణాలు, పెద్దఎత్తున లేఅవుట్లు వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోబహుళ అంతస్థుల భవనం కోసమైనా, లే అవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ అనుమతి కోసమైనా దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువులోపు పరిష్కారం చేసి అనుమతులివ్వాలి.


ఐదేళ్లకు మించి పనిచేస్తున్న వారు సొంత శాఖకు?

హెచ్‌ఎండీఏ(HMDA)లో డిప్యుటేషన్‌పై వచ్చి వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను సొంత శాఖకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఐదేళ్లకు మించి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్లానింగ్‌ విభాగంలో నలుగురు, ఇంజనీరింగ్‌ విభాగంలో 30మంది ఇతర అడ్మినిస్ర్టేటివ్‌ విభాగాల్లో మరో 30మంది వరకు ఉన్నారు. అర్బన్‌ ఫారెస్టు విభాగంలో పది మందికి పైగా ఉండగా, ఇటీవల డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో వారంతా సొంత శాఖకు వెళ్లారు. హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల్లో పలువురు అప్పటి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీలతో వచ్చారు. కొందరిది డిప్యుటేషన్‌ గడువు ముగిసినా పలుకుబడితో హెచ్‌ఎండీఏలోనే కొనసాగుతున్నారు. తాజా బదిలీల నేపథ్యంలో స్థానచలనం కలగనుంది.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 12:36 PM

Advertising
Advertising
<