ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..

ABN, Publish Date - Nov 15 , 2024 | 05:20 PM

గాడిద పాల వ్యాపారం పేరుతో రైతులను డ్యాంకీ ప్యాలెస్ సంస్థ నట్టేట ముంచింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్, నవంబర్ 15: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి పేరిట తమిళనాడుకు చెందిన డ్యాంకీ ప్యాలెస్ సంస్థ రూ. 100 కోట్ల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు రూ. 1600 లకు కొనుగోలు చేస్తామంటూ దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది.

Also Read: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు


అందుకు వారితో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఆ క్రమంలో ఒక్కొ గాడిదను వారికి రూ. లక్షన్నరకు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలు రైతులకు సక్రమంగా సంస్థ నగదు చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు.

Also Read:: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే


దాంతో వారికి చెక్కులను అందజేసింది. అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులు భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌ క్లబ్‌లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమను న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. గత 18 నెలలుగా తమకు నగదు చెల్లించడం లేదని వారు తెలిపారు.

Also Read: నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


ఇటీవల కాలంలో గాడిద పాలు విక్రయం బాగా పెరిగింది. వీటికి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలు శ్రేష్టమైనవని ఓ ప్రచారం అయితే జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సైతం ఈ గాడిద పాలు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే ఈ గాడిద పాల ధర అధికంగా ఉంటుందని సమాచారం.


అయితే ఆరోగ్య దృష్ట్యా ఈ పాల వినియోగం అధికంగా ఉంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించ వచ్చంటూ..రైతులను డాంకీ ప్యాలెస్ సంస్థ ఆశ చూపింది. ఆ క్రమంలో భారీగా నగదు వెచ్చించి.. గాడిదలను కొనుగోలు చేసేలా వ్యూహా రచన చేశారు. తొలి నాళ్లలో సజావుగా నగదు చెల్లించిన సదరు సంస్థ.. ఆ తర్వాత రైతులను నట్టేట ముంచేసింది. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాలను వారు అభ్యర్థిస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 05:21 PM