ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మానవ అవయవ అక్రమ రవాణా మాఫియా మాస్టర్‌మైండ్‌ రాంప్రసాద్‌ అరెస్ట్‌

ABN, Publish Date - Jun 02 , 2024 | 03:13 AM

అంతర్జాతీయ మానవ అవయవ అక్రమ రవాణా మాఫియాలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న రాంప్రసాద్‌ను కేరళ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన బి.రాంప్రసాద్‌ అలియాస్‌ ప్రతాప్‌ మానవ అవయవ అక్రమ రవాణా ముఠాలో మాస్టర్‌మైండ్‌ అని ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సెనా తెలిపారు.

  • హైదరాబాద్‌లో పట్టుకున్న కేరళ పోలీసులు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మానవ అవయవ అక్రమ రవాణా మాఫియాలో మాస్టర్‌మైండ్‌గా ఉన్న రాంప్రసాద్‌ను కేరళ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన బి.రాంప్రసాద్‌ అలియాస్‌ ప్రతాప్‌ మానవ అవయవ అక్రమ రవాణా ముఠాలో మాస్టర్‌మైండ్‌ అని ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సెనా తెలిపారు. అతను మొదట తన కిడ్నీ దానం చేసేందుకు ముఠాతో సంప్రదింపులు జరిపాడు. అయితే అనారోగ్య కారణాలతో కిడ్నీ ఇచ్చేందుకు వీలుకాలేదు. ఆ తర్వాత ముఠాతో చేతులు కలిపి అంతర్జాతీయ మానవ అవయవ అక్రమ రవాణాలో సూత్రధారిగా మారాడు.


సోషల్‌ మీడియాలో అవయవ దానం పేరుతో గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఆకర్షించి ఇరాన్‌కు తరలించేవాడు. ఇక్కడి నుంచి పంపించే వారిని ఇరాన్‌లో నాసర్‌ రిసీవ్‌ చేసుకునేవాడు. అవయవదానం తర్వాత వారికి కొంత మొత్తం చెల్లించి భారత్‌కు తిప్పి పంపేవారు. నాసర్‌ను కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదివరకే అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ వైభవ్‌ తెలిపారు. నాసర్‌తోపాటు మరో ఇద్దరు కీలక నిందితులనూ అరెస్ట్‌ చేశామని, అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రాంప్రసాద్‌ను శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

Updated Date - Jun 02 , 2024 | 03:13 AM

Advertising
Advertising