Hussainsagar: నిండుకుండలా హుస్సేన్‌సాగర్..
ABN, Publish Date - Sep 01 , 2024 | 01:10 PM
భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్(Hussainsagar) నిండుకుండలా మారింది. బంజారాహిల్స్, పికెట్, కూకట్‌పల్లి(Banjarahills, Pickett, Kukatpally) నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్‌లెవల్ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు.
హైదరాబాద్ సిటీ: భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్(Hussainsagar) నిండుకుండలా మారింది. బంజారాహిల్స్, పికెట్, కూకట్‌పల్లి(Banjarahills, Pickett, Kukatpally) నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్‌లెవల్ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం చేసింది. హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.43 మీటర్లుగా ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: Red Alert: 11 జిల్లాల్లో రెడ్ అలెర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి
..........................................................................
ఈ వార్తను కూడా చదవండి:
............................................................................
Cyber criminals: ట్రేడింగ్‌లో అధిక లాభాలిస్తామని వృద్ధుడిని నమ్మించి రూ.10.53 లక్షలు కొల్లగొట్టేశారు..
హైదరాబాద్ సిటీ: ట్రేడింగ్‌లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals).. 62 ఏళ్ల వృద్ధుడిని ‘మామ్’ వాట్సాప్ క్లబ్‌లో చేర్పించి, లాభాలు ఇస్తున్నట్లు నటించి రూ.10,53,696లను కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్(Facebook) చూస్తున్న బాధితుడికి ఒక ప్రకటన కనిపించింది. స్టాక్ ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే.. అధిక లాభాలు వస్తాయని ఉంది. దాంతో ఆ లింక్‌పై క్లిక్‌చేశాడు. వెంటనే లైన్‌లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడి ఫోన్ నంబర్‌ను ‘మామ్ క్లబ్’ వాట్సా్‌పలో చేర్పించారు. ముందుగా కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టించిన క్రిమినల్స్ కొద్దిమొత్తంలో లాభాలు ఇచ్చారు.
వాటిని విత్‌డ్రా చేసుకున్న బాధితుడు ఇదంతా నిజమైన స్టాక్ ట్రేడింగ్ అని నమ్మాడు. అలా సైబర్ నేరగాళ్లు మెల్లగా బాధితుడిని ఊబిలోకి దింపి.. ఇంకా ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి ప్లేస్టోర్ నుంచి ‘ఎంటీపీఎస్’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయించారు. ఆ తర్వాత నలుగురు మాత్రమే ఉన్న మరో గ్రూపు ‘మామ్ క్లబ్ వీఐపీ ఏ97’ లో చేర్పించారు. ఆ తర్వాత నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్ సృష్టించి విడతలవారీగా పెట్టుబడులు పెట్టించి రూ.10,53,696 కొల్లగొట్టారు. విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేసిన మోసగాళ్లు.. ఇంకా ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 01 , 2024 | 01:10 PM