ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 2 రోజులు.. 2 ప్రమాదాలు.. ఇద్దరి మృతి

ABN, Publish Date - Jul 24 , 2024 | 12:12 PM

వర్షం పడితే చాలు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌(Khairatabad Flyover) రోడ్డు ప్రమాదకరంగా మారుతోంది. చాలాకాలం క్రితం వేసిన సీసీ రోడ్డు కావడంతో అది పూర్తిగా అరిగిపోయింది. దీనికితోడు రోడ్డు మధ్యలో అతుకుల వద్ద వేసిన డాంబర్‌ కోటింగ్‌ల వల్ల ద్విచక్ర వాహనాలు పైకి ఎగిరి అదుపుతప్పి పడిపోతున్నాయి.

- ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై వరుస ప్రమాదాలు

- సీసీ రోడ్డు అరగడంతో జారుతున్న వాహనాలు

- అదుపు తప్పి కింద పడిపోతున్న పరిస్థితి

- పట్టించుకోని ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు

హైదరాబాద్: వర్షం పడితే చాలు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌(Khairatabad Flyover) రోడ్డు ప్రమాదకరంగా మారుతోంది. చాలాకాలం క్రితం వేసిన సీసీ రోడ్డు కావడంతో అది పూర్తిగా అరిగిపోయింది. దీనికితోడు రోడ్డు మధ్యలో అతుకుల వద్ద వేసిన డాంబర్‌ కోటింగ్‌ల వల్ల ద్విచక్ర వాహనాలు పైకి ఎగిరి అదుపుతప్పి పడిపోతున్నాయి. గత ఆది, సోమవారాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం వర్షం కురుస్తుండగా ఇద్దరు యువకులు వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి ఫుట్‌పాత్‌(Footpath)ను ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయలు కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. మరుసటిరోజుసోమవారం అర్ధరాత్రి ముగ్గురు వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలై మృతి చెందాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘గోరటి’కి దాశరథి ప్రజా సాహిత్య పురస్కారం..


చినుకు పడితే అంతే సంగతి

ఎన్టీఆర్‌ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌(Khairatabad Flyover) నిర్మించారు. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫ్లైఓవర్‌పై వెళ్తుంటే అతుకుల వద్ద వైబ్రేషన్స్‌ వస్తాయి. దీనికితోడు పైన వేసిన సీసీ రోడ్డు పూర్తిగా అరిగిపోయింది. దీంతో చి న్న వర్షం కురిసినా ద్విచక్ర వాహనాలు అదుపుతప్పుతున్నాయి. ఈ ఫ్లైఓవర్‌పైన రెండు వైపులా రెండు భారీ మలుపులు ఉన్నాయి. వేగంగా వెళ్తూ మూలమలుపుల వద్ద బ్రేక్‌ వేసినా ఆగకుండా వాహనం జారి అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రా ఫిక్‌ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధత అధికారులు దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.


వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాం

వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటాం. మూల మలుపుల వద్ద వేగాన్ని నిరోధించేందుకు కోన్‌లను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాం. రోడ్డు పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ వర్గాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం. ప్రమాదాలు ఎక్కువగా వేగంగా వెళ్లడం వల్లే జరుగుతున్నాయి. వర్షం పడ్డ సమయాల్లో జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్లాలి. - రాజశేఖర్‌, సైఫాబాద్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 12:12 PM

Advertising
Advertising
<