Hyderabad: గచ్చిబౌలి డిపోలో 69 విద్యుత్ బస్సులు..
ABN, Publish Date - Oct 19 , 2024 | 10:26 AM
రోడ్డు రవాణా సంస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం శుభపరిణామమని గచ్చిబౌలి డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బస్‌డిపోలో(Gachibowli Bus Depot) మొత్తం 69 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. మూడు దఫాలుగా ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం శుభపరిణామమని గచ్చిబౌలి డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బస్‌డిపోలో(Gachibowli Bus Depot) మొత్తం 69 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. మూడు దఫాలుగా ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వందశాతం కాలూష్యరహిత బస్సులు నడపడం సంస్థకు, మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 20 రోజులుగా బస్సులను డిపోను నుంచి నడపడం జరుగుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ బస్సుల సర్వీసులు ఉంటాయని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘నిమ్స్’లో గుండె కవాటాల బ్యాంక్..
69 విద్యుత్ బస్సులు ప్రతి రోజు 19350 కిలో మీటర్లు నడుపుతున్నామన్నా రు. ఈ బస్సుల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏ మాత్రం వాయు, ధ్వని కాలుష్యం ఉండదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్‌లో ప్రధాన నగరాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెడితే సంస్థకు మంచి లాభాలతో పాటు వాతావరణం కాలుష్యం సైతం ఉండదన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 180 కిలో మీటర్లు బస్సు తిరుగుతుందని, 3 గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుందని, ఒక యూనిట్ విద్యుత్‌లో కిలోమీటర్ వెళ్లవచ్చని మురళీధర్‌రెడ్డి వివరించారు. అయితే ప్రజలు అవగాహన లేక వందశాతం బస్సులు ఉపయోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం 40 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుపుతున్నామని, రాబోయే రోజుల్లో వందశాతం 100 ఆక్యుపెన్సీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- అన్ని రకాల పాస్‌లకు అనుమతి
విద్యుత్ బస్సుల్లో ఎక్కువ చార్జీ తీసుకుంటారనే అపోహ ఉందని, అది కేవలం అపోహ మాత్రమేనన్నారు. డీజిల్ బస్సుల్లో టిక్కెట్ ధర ఎంత ఉంటుందే ఈ బస్సుల్లో కూడా అంతే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచిత బస్సు సర్వీ్‌సను మహిళలు ఉపయోగించుకోవచ్చన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యత్ బస్సులు నడిపేందుకు అన్నిరకాల అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీంతో సంస్థకు మంచి ఆదాయం వస్తుందన్నారు.
- డిపోలో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
విద్యుత్ బస్సులు చార్జింగ్ కోసం విశాలమైన మైదానంలో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజర్ తెలిపారు. ఒకేసారి 30బస్సులకు చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. ఒకబస్సు మొత్తం 3 గంటల్లో పూర్తిస్థాయి లో చార్జింగ్ జరుగుతుందన్నారు. రానున్న రోజు ల్లో చార్జింగ్ స్టేషన్‌ను కూడా విస్తరిస్తామని తెలిపారు. ప్రజలు విద్యుత్ బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరవచ్చన్నారు.
ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఈ బస్సుల్లో కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ బస్సులను జంటనగరాల్లో మాత్రమే నడపడం జరుగుతుందని, భవిష్యత్‌లో దూరప్రాంతాలకు విస్తరిస్తామని మేనేజర్ తెలిపారు.
ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్ బాషా అరెస్టు..
ఇదికూడా చదవండి: High Court: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్‌రావు
ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!
ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 19 , 2024 | 10:26 AM