Hyderabad: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ నేత
ABN, Publish Date - Apr 25 , 2024 | 11:30 AM
బీఆర్‌ఎస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి(Vemula Amarender Reddy), ఆయన సతీమణి 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి, మునగనూర్ మాజీ ఎంపీటీసీ నక్క శ్రవంతి రమేష్‌గౌడ్, మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరినాయక్‌తో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
- కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు
- తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఖాళీ..?
హైదరాబాద్: బీఆర్‌ఎస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి(Vemula Amarender Reddy), ఆయన సతీమణి 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి, మునగనూర్ మాజీ ఎంపీటీసీ నక్క శ్రవంతి రమేష్‌గౌడ్, మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హరినాయక్‌తో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసంలో వారంత కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, హరిత ధన్‌రాజ్‌గౌడ్, వంశీధర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి..
తుర్కయంజాల్ మున్సిపాలిటీకిచెందిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరు మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటిస్తూ వారంతా ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలువగానే బీఆర్‌ఎస్‌కు చెందిన 19వ వార్డు కౌన్సిలర్ కవిత శేఖర్‌గౌడ్, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఇంజాపూర్‌కు చెందిన నోముల కృష్ణగౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు కొత్తకుర్మ సత్తయ్య, ఇంజాపూర్‌కు చెందిన కౌన్సిలర్ బొక్క రవీందర్‌రెడ్డి, కమ్మగూడకు చెందిన ప్రేంకుమార్‌తో పాటు అనేక మంది వార్డు స్థాయి నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంత మంది కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: ప్రచారం హోరెత్తేలా.. ప్రణాళికలు రచిస్తున్న అభ్యర్థులు
అప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్‌రెడ్డి రంగారెడ్డిని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారే రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరడానికి ముందు వరుసలో నిలిచున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఏకంగా బీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో చేరడంతో బీఆర్‌ఎస్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు..?
కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు కొందరు బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్ల చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకు ముందు మల్‌రెడ్డి రంగారెడ్డిని పూర్తిగా వ్యతిరేకించిన వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని అధిష్ఠానంతో వాగ్వాదానికి దిగుతున్నారు. బీఆర్‌ఎస్ నాయకులను చేర్చుకోవద్దని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారందరిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పట్ల వారు నిరుత్సాహంగా ఉన్నారు. కొన్ని వార్డుల్లో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒకే గూటికి రావడంతో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఇదికూడా చదవండి: Lok Sabha Polls: రాజాసింగ్ డుమ్మా వెనుక ఉన్న మతలబు ఏమిటో..?
Read Latest National News and Telugu News
Updated Date - Apr 25 , 2024 | 11:30 AM